‘డర్టీ హరి’ ఫస్ట్ లుక్ రిలీజ్

Dirty Hari First Look Poster Is Out

ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు సీనియర్ నిర్మాత ఎంఎస్‌ రాజు. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎంఎస్‌ రాజు. దర్శకుడిగా మారి తూనీగా తూనీగా, వాన చిత్రాలను తెరకెక్కించగా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తర్వాత సినీ పరిశ్రమకే దూరమయ్యారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్‌ రాజు తాజాగా ‘డర్టీ హరి’ అనే సినిమాతో వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా టైటిల్ ను నిన్ననే రిలీజ్ చేయగా.. ఈరోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడటానికి చాలా బోల్డ్ గా వుంది. దీన్నిబట్టి రాజు గారు బోల్డ్ కంటెంట్ తో వస్తున్నారని అర్థమైంది. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ చూస్తుంటే మూవీ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

కాగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు శ్రవణ్ రెడ్డి. పరిచ గూడూరి శివ‌రామకృష్ణ‌, గూడురు స‌తీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్‌పీజే క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయ‌డం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =