అలీ నిర్మాణ సంస్థ ‘అలీవుడ్’

Comedian Ali Starts His Movie Production House Aliwood

‘అలీవుడ్’ ఇదేంటి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా హాలీవుడ్ వరకు విన్నాం కదా.. ఇదేం వుడ్ అబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే… ప్రముఖ కామెడీ హీరో, హాస్యనటుడు అలీ కూడా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరే అలీవుడ్. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఆయన ఈ సంస్థను ఏర్పాటుచేశారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర, అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ ఇతర సినిమా ప్రముఖులు విచ్చేసి లోగో ఆవిష్కరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో వెబ్ సీరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుందని, నష్టాలు లేకుండా నిర్మాతలకు అదాయం లభించే అవకాశం మా అలీవుడ్ సంస్థ కల్పిస్తుందన్నారు. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను తమ సంస్థలో కల్పిస్తున్నామని, తాను తీయబోయే వెబ్ సిరీస్, టీవీ షోలను అభిమానులు ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు.

ఇక ఈ నిర్మాణ సంస్థ ద్వారా వెబ్ సిరీస్, టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందించనున్నారు. కేవలం తెలుగులోనే కాదు… హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నిర్మాణాలు ప్రారంభించాలన్న ప్లాన్ వున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nine =