నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించాలని ఉంది – ప్రియమణి

Priyamani Wants To Act In A Negative Shaded Role

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్ర నటి ప్రియమణి “పరుత్తి వీరన్ “(2006 ) మూవీ లో అద్భుతంగా నటించి ఉత్తమ నటి గా జాతీయ అవార్డ్ అందుకొన్నారు. తెలుగులో ప్రియమణి హీరోయిన్ గా నటించిన పెళ్ళైన కొత్తలో, యమదొంగ, శంభో శివ శంభో, గోలీమార్, రగడ , క్షేత్రం మూవీస్ ఘనవిజయం సాధించాయి. “మన ఊరి రామాయణం ” మూవీ తరువాత ప్రియమణి తెలుగు మూవీస్ లో నటించలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెబ్ సిరీస్, రియాలిటీ షోస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియమణి , బ్లాక్ బస్టర్ తమిళ మూవీ “ఆసురన్ ” తెలుగు రీమేక్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. నటిగా వెండితెరకు పరిచయమై 17 సంవత్సరాలు అయ్యిందని , ఇంతటి లాంగ్ జర్నీ లో వెనుదిరిగి చూసుకొంటే సంతోషంగానే ఉందని, రజనీకాంత్ “నరసింహా ” మూవీ లో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి తరహా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించాలని ఉందని ప్రియమణి తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =