మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14 కోట్లకు పైగా జరిగినట్టు సమాచారం. నైజాంలో 5 కోట్లకు పైగా, సీడెడ్ లో 3 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్లు కు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయబడ్డాయి. మరి సినిమాపై భారీ అంచనాలే వున్నాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో 15 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జనవరి 9న విడుదలకానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: