కె.జి.ఎఫ్2 టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

KGF Chapter 2 Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Telugu Movie Latest News,KGF Chapter 2 Movie Teaser Release Date,KGF Chapter 2 Telugu Movie Teaser Release Date,KGF Chapter 2 Teaser Release Date Fixed,KGF Chapter 2 Teaser Release Date Confirmed

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించ‌గా, క‌న్న‌డ‌లో 100 కోట్లు వ‌సూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రేర్ ఫీట్ ను దాటి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదే జోష్ తో కె.జి.ఎఫ్‌ సీక్వెల్ కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 2 ను కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ చిన్నగా ఒక్కొక్కటి ఇస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈసారి అభిమానులకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.