బాలీవుడ్ లోకి ‘ఆకాశం నీ హ‌ద్దురా..!’

Actor Suriya Latest Blockbuster Akasam Nee Haddura Goes To Bollywood

బాలీవుడ్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ మధ్య చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ఇంకా కొన్ని సినిమాలు లైన్ లో కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో సినిమాను రీమేక్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమా అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే రీమేక్ కు రెడీ అయిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. చాలా సినిమాల త‌ర్వాత సూర్య మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. నటనపరంగా సూర్యకు, డైరెక్టర్.గా సుధా కొంగరకు వందకు వంద మార్కులు పడ్డాయి. మోస్ట్ ఎమోషనల్ ఎటాచబుల్ స్టోరీగా అందరి మనసుల్నీ హత్తుకుంది.

ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రీమేక్ చేయాలని చూస్తున్నాడట. ఇప్ప‌టికే అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాల‌ని రీమేక్ చేసిన షాహిద్ ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం దీనిపై చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ట్టు సమాచారం. త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా అప‌ర్ణ బాల ముర‌ళి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్‌, ఊర్వ‌శి, క‌రుణాస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సూర్య‌, గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మించారు. ఎయిర్ డెక్క‌న్ అధినేత గోపీనాథ్ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్ర‌మిది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − four =