“సీటీమార్” అప్ డేట్

Gopichand Seeti Maar Movie Team Comes Up With An Interesting Update

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ ,తెలంగాణ కబడ్డీ టీమ్ కొచ్ గా తమన్నా నటిస్తున్నారు. “హిప్పీ ” మూవీ ఫేమ్ దిగాంగన , సీనియర్ హీరోయిన్ భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో నిలిచిపోయిన “సీటీ మార్ ” మూవీ షూటింగ్ సుమారు 8 నెలల తరువాత హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ .. లాక్ డౌన్ కు ముందు “సీటీ మార్ ” మూవీ 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందనీ, బ్యాలెన్స్ షూటింగ్ ను నవంబర్ 23 వతేదీ ప్రారంభించి సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశామనీ , హీరో గోపీచంద్ కెరీర్ లో హై బడ్జెట్ తో “సీటీ మార్ ” మూవీ తెరకెక్కుతుందనీ , స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భావోద్వేగ భరిత కథ తో , హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతుందనీ చెప్పారు. అవసరమైన అన్ని జాగ్రత్తలతో “సీటీ మార్ ” మూవీ షూటింగ్ కు  సిద్ధం అయ్యామని దర్శకుడు సంపత్ నంది తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =