లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. చెప్పినట్టే ఫ్యాన్స్ కు టీజర్ దీపావళి గిఫ్ట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇక ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరోలు కావడంతో విజయ్, విజయ్ సేతుపతిల మార్క్ ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు లోకేష్ కనకరాజు జాగ్రత్త పడినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చివరలో విజయ్, విజయ్ సేతుపతిలు ఫైట్ చేస్తున్న సీన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. మరి టీజర్ కే ఇంత రెస్పాన్స్ వస్తుంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: