అప్పుడే పెళ్లి చేసుకుంటా – లేకపోతే సింగిల్ గానే ఉంటా

Actress Trisha Gives Sensational Statement About Her Marriage

కొంత మంది హీరోయిన్స్ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. వారి పెళ్లి, ప్రేమ విషయాలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్క వీరి పెళ్లిళ్లపై ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. వీరిలో నయన్ అంటే విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుంది కాబట్టి అది వేరు. కానీ త్రిష, అనుష్క మేము సింగిల్ అని చెప్పినా కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక తాజాగా తన పెళ్లిపై స్పందించిన త్రిష తనకు ఎలాంటి వాడు కావాలో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో అన్న విషయాలు స్పష్టం చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తన పెళ్లిపై స్పందించిన త్రిష నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా పెళ్లిచేసుకుంటాను.. నన్ను అర్ధం చేసుకున్న వ్యక్తి దొరికినప్పుడే నా వైవాహిక జీవితం కూడా అప్పుడే ప్రారంభమవుతుంది.. అప్పటివరకూ సింగిల్ గానే ఉంటా.. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే జీవితాంతం సింగిల్ గా ఉంటా అని క్లారిటీ ఇచ్చేసింది. మరి చూద్దాం త్రిషకు అలాంటి వ్యక్తి ఎప్పుడు దొరకుతాడో..

‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. ‘వర్షం’ సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది.

ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో ప్రస్తుతానికి సినిమాలు లేవు కానీ.. తమిళ్ లో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో త్రిష ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దీనితో పాటు మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + two =