‘ఆకాశం నీ హద్దురా’ పై విజయ్ ప్రశంసలు – సుధా గారు మీతో వర్క్ చేస్తా

Tollywood Crazy Actor Vijay Deverakonda Express His Interest To Work With Aakasam Nee Haddura Movie Director

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. lచాలా సినిమాల త‌ర్వాత సూర్య మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. నటనపరంగా సూర్యకు, డైరెక్టర్.గా సుధా కొంగరకు వందకు వంద మార్కులు పడ్డాయి. మోస్ట్ ఎమోషనల్ ఎటాచబుల్ స్టోరీగా అందరి మనసుల్నీ హత్తుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాపై సెలబ్రిటీస్ పై కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించి ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేశాడు. సూర్య గారు ఒక అద్భుతమైన నటుడు. ఆయన నటనను చూసిన తరువాత తప్పకుండా ప్రేమలో పడిపోతారు. ఇక హీరోయిన్ అపర్ణ బాలా గురించి.. సుధా గారికి ఇలాంటి అమ్మాయిలు ఎలా కనిపిస్తారో.. అపర్ణ అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని ట్వీట్ చేసాడు. ఇక సుధ కొంగరపై కూడా ప్రశంసలు కురిపించిన విజయ్. నేను త్వరలో మీతో కలిసి పని చేస్తాను. ఇది డైరెక్టర్ గా మీ పట్ల నాకున్న ప్రశంసలను తెలియజేస్తోందని అన్నాడు.

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =