కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఖుష్బూకి తృటిలో తప్పిన ప్రమాదం

ఖుష్బూకి తృటిలో తప్పిన ప్రమాదం

Actress Khushbu Escapes Unhurt From The Road Accident Happened Today

సినీ న‌టి, భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు ఖుష్బూకి తృటిలో ప్రమాదం తప్పింది. చెన్నై లోని ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల నిమిత్తం వెళుతుండగా చెన్నైలోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ కావడంతో వేరే వాహనంలో ఆమె వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇక ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలపడంతో విషయం అందరికీ తెలిసింది. కారు ప్రమాద ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఖుష్బూ వెల్లడించారు. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల తాను క్షేమంగా బయటడ్డానని ఖుష్బూ ట్వీట్ చేశారు.అయితే తన భర్తకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని తెలిపింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్