క్లైమాక్స్ లో A1ఎక్స్ ప్రెస్

A1 Express Movie Team To Wrap up movie shooting

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇక ఇటీవలే లావణ్య త్రిపాఠి తన షూటింగ్ ను పూర్తిచేసుకోగా ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక వీడియోను సందీప్ కిషన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. ఆరు నెలలు హాకీ ట్రైనింగ్ .. దాదాపు ఒక ఏడాది నుండి ఈ పాత్రలో వున్నాను.. ఫైనల్లీ సినిమా షూటింగ్ పూర్తికానుందని.. కేవలం ఒక్క రోజు షూట్ మాత్రమే మిగిలి ఉందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపాడు.

 

 

View this post on Instagram

 

A post shared by sundeep kishan (@sundeepkishan)

కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 17 =