‘క‌మిట్‌మెంట్’ టీజ‌ర్ రిలీజ్

Exotic Thriller Commitment Movie Teaser Is Out

హైద‌రాబాద్ న‌వాబ్స్ ఫేం ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో తేజ‌స్వి మ‌డివాడ, అన్వేషి జైన్, ర‌మ్య ప‌సుపిలేటి‌, సూర్య శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం క‌మిట్ మెంట్‌. ల‌వ్, డ్రీమ్,హోప్‌, ఫైట్ అనే నాలుగు భిన్న‌మైన స్టోరీల‌తో ఈ చిత్రం సాగుతుంది. ర‌చ‌న మీడియా వ‌ర్క్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో ఎఫ్3 ప్రొడ‌క్ష‌న్, ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై బ‌ల్‌దేవ్‌సింగ్‌, నీలిమ. టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. న‌లుగురు మ‌హిళ‌ల జీవితంలోకి పురుషులు ఎంట‌రైన త‌ర్వాత  వారి జీవితాల‌పై క‌మిట్ మెంట్ ప్ర‌భావం ఎలా ప‌డిందనేది సినిమాలో చూపించ‌నున్న‌ట్టు టీజ‌ర్ ను చూస్తే అర్త‌మ‌వుతుంది. ఆడ‌పిల్ల‌లు క‌న‌బ‌డితే క‌మిట్‌మెంట్లు, కాంప్ర‌మైజ్‌లు త‌ప్ప ఇంకేమి ఆలోచించ‌రా అంటూ తేజ‌స్వి చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

 

ఈ సంద‌ర్భంగా..తేజ‌స్వి మ‌డివాడ మాట్లాడుతూ – ‘ప్ర‌తి యాక్ట‌ర్ కెరీర్‌లో కొంత స్ట్రగులింగ్ స్టేజ్ ఉంటుంది. నేను కూడా అలాంటి స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఈ అవ‌కాశం నా ద‌గ్గ‌ర‌కు రావ‌డం జ‌రిగింది. మ‌ళ్లీ నాకు సినిమాల‌పై ఇంట్ర‌స్ట్ రావ‌డానికి ల‌క్ష్మీకాంత్ చెన్నా నే కార‌ణం. ఆయ‌న చెప్పిన స‌బ్జెక్ట్ నాకు అంత‌గా క‌నెక్ట్ అయ్యింది. ఇది కేవ‌లం స్క్రిప్ట్ మాత్ర‌మే కాదు ప్ర‌తి అమ్మాయి లైఫ్ స్టోరీ అనేంత‌లా రియ‌లెస్టిక్ గా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీలో కొంత బోల్డ్‌గానే న‌టించ‌డం జ‌రిగింది అయితే కేవ‌లం రొమాంటిక్ పిక్చ‌ర్ గానే కాకుండా మంచి సందేశాత్మ‌క చిత్రంగా కూడా ఉంటుంది’ అన్నారు.

ద‌ర్శ‌కుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ.. ‘గ‌తేడాది అక్టోబ‌ర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ ఏడాది అక్టోబ‌ర్ లో షూటింగ్ పూర్తిచేశాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ ‌ జ‌రుగుతున్నాయి. టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మీ అంద‌రికీ కూడా న‌చ్చుంద‌నే అనుకున్నాను. ఈ టైటిల్ చూసి చాలా మంది సినీ ప్ర‌ముఖులు ఈ ఈవెంట్‌కి రాలేదు. అయినా మాకు మీడియా స‌పోర్ట్ ఉంటుంద‌నే న‌మ్మ‌కంతో మా టీమ్ అంద‌రం క‌లిసి టీజ‌ర్ లాంచ్ చేయ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అన్ని ఇండ‌స్ట్రీల‌లో అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విష‌యాన్నే ఈ సినిమాలో చూపించ‌డం జ‌రిగింది. ఎదో స్కిన్ షో చేసి అమ్ముకోవాల‌ని ఈ సినిమా చేయ‌లేదు. క‌థ‌ని బ‌లంగా న‌మ్మి ఈ సినిమా చేశాను. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.