రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అటు ఎన్టీఆర్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారా అని గతకొద్ది కాలంగా తెగ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో అని ఇటీవలే ప్రకటించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఎవరితో ఉండబోతుందో అన్న చర్చలు నడుస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. రామ్ చరణ తర్వాత సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో వుండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా విక్రమ్ కుమార్ ను కలిసి స్టోరీ లైన్ చెప్పగా రామ్ చరణ్ కూడా ఇంప్రెస్ అయ్యాడట. అంతేకాదు మొత్తం కథను సిద్ధం చేయమని కూడా చెప్పాడట. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[custom_ad]
ఇదిలా ఉండగా కొరటాల శివ – చిరు కాంబినేషన్ లో వస్తున్న సినిమలో కూడా చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ బాబు పేరు కూడా విపిస్తుంది. మరి దీనిపై కూడా క్లారిటీ రావాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: