నానితో మ‌రోసారి ర‌ష్మిక జోడీ?

Natural Star Nani Teams Up With Rashmika After Devadas Movie

నేచుర‌ల్ స్టార్ నాని… `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు… ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ సినిమాలో ఇప్ప‌టికే ఓ నాయిక‌గా సాయిప‌ల్ల‌వి ఎంపికైంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. `ఎంసీఏ` అనంత‌రం నాని, ప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌చ్చే చిత్రం ఇదే కానుంది. కాగా, మ‌రో హీరోయిన్ గా ర‌ష్మిక పేరు వెలుగులోకి వ‌చ్చింది. అదే గ‌నుక నిజ‌మైతే… `దేవ‌దాస్` త‌రువాత నాని, ర‌ష్మిక కాంబోలో వచ్చే సినిమా ఇదే అవుతుంది. త్వ‌ర‌లోనే సాయిప‌ల్ల‌వి, ర‌ష్మిక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మే నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న `శ్యామ్ సింగ రాయ్`… డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + ten =