మెగాస్టార్ చిరంజీవి, దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ అధినేత దేవీవర ప్రసాద్‌ది విజయవంతమైన జోడి. ‘తిరుగులేని మనిషి’(1981)తో మొదలైన వీరి ప్రయాణం… ‘మృగరాజు’(2001) వరకు సాగింది. వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘అల్లుడా మజాకా!’ ఒకటి. చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాలో… లక్ష్మి, ఊహ, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, శ్రీహరి, ఎ.వి.యస్, మహేష్ ఆనంద్, అల్లు రామలింగయ్య, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ‘ఘరానా మొగుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత చిరు, నిర్మాత దేవీవర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ‘అల్లుడా మజాకా!’ని టాలెంటెడ్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర గీతాలకు… కోటి ఆకట్టుకునే బాణీలను అందించారు. “అత్తో అత్తమ్మ కూతురో”, “చిన్నపాపకేమో”, “రెడ్డురెడ్డు బుగ్గే రెడ్డు”, “మావూరి దేవుడు”, “పిట్ట కూత పెట్టరా”, “ఉంగాఉంగ” పాటలు మెగా అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా విశేషంగా అలరించాయి. మరీ ముఖ్యంగా “అత్తో అత్తమ్మ కూతురో” ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. 1995 ఫిబ్రవరి 25న విడుదలై ఘనవిజయం సాధించిన ‘అల్లుడా మజాకా!’… నేటితో 25 ఏళ్ళను పూర్తి చేసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: