తమిళనాట సంచలనం సృష్టించిన `అసురన్`… తెలుగులో `నారప్ప` పేరిట పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి జోడీగా ప్రియమణి సందడి చేయనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి… ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ షూట్ జరుగుతోందట. ఇందులో భాగంగా వెంకటేష్, మలయాళ నటి రెబా మోనికా జాన్ పై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. కాగా, వేసవి కానుకగా మే నెలలో `నారప్ప` రిలీజ్ కానుంది. మరి.. `ఎఫ్ 2`, `వెంకిమామ` విజయాలతో దూకుడు మీదున్న వెంకీ… ఈ చిత్రంతోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































