ఫిబ్రవరి 28 వ తేదీ రిలీజ్ కానున్న 5 సినిమాలు

These Five Telugu Movies Set To Release On 28th February 2020

ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం కూడా 5 సినిమాలు రిలీజ్ అయ్యి అలరించనున్నాయి. వీటిలో 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ 5 మూవీస్ గురించి తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. HIT :హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ “ఫలక్ నుమా దాస్ “మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ “HIT” మూవీ రూపొందింది. రుహానీ శర్మ కథానాయిక కాగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ మూవీ పై అంచనాలు పెంచాయి.

2. స్వేఛ్చ : సరస్వతి డెవలపర్స్ సమర్పణ లో లచ్చు రామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై KPN చౌహాన్ దర్శకత్వంలో సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో రూపొందిన స్వేఛ్చ మూవీ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సింగర్ మంగ్లీ కథానాయిక గా ఈ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. భోలే శావళి స్వరకల్పనలో రూపొందిన సాంగ్స్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి.

3. రాహు : శ్రీ శక్తి స్వరూప్ క్రియేషన్స్ బ్యానర్ పై సుబ్బు వేదుల దర్శకత్వంలో అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ “రాహు” మూవీ రూపొందింది. ఈ మూవీ కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. “రాహు” మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

4.లోకల్ బాయ్ : సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “లోకల్ బాయ్ ” మూవీ రూపొందింది. స్నేహ, మెహరీన్ కథానాయికలు కాగా నవీన్ చంద్ర, నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. “పట్టాస్” తమిళ మూవీ కి డబ్బింగ్ వెర్షన్ “లోకల్ బాయ్” మూవీ.

5 . కనులు కనులను దోచాయంటే : వయాకామ్ 18 స్టూడియోస్, AJ ఫిల్మ్ కంపెనీ, DQ బ్యానర్స్ పై దేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందిన తమిళ మూవీ “కన్నుమ్ కన్నుమ్ కొళ్ళైయాడితాళ్” తెలుగు డబ్బింగ్ వెర్షన్ ” కనులు కనులను దోచాయంటే” మూవీ 28వ తేదీ రిలీజ్ కానుంది .ఈ మూవీ లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించడం విశేషం.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.