ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘V’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోపక్క ప్రమోషనా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో నాని పాత్రకు ధీటుగా ఉండే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. నాని, సుధీర్ బాబు మధ్య నువ్వా నేనా? అనేలా వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మరో కొత్త నానిని చూసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘మనసు మరీ’ అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
[custom_ad]
కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్, హర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.అంతేకాదు ఫస్ట్ టైమ్ నాని నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. మరి చూద్దాం నాని నెగెటివ్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో..!
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: