లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన `రోజా` (1992) చిత్రం… అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, ఎ.ఆర్. రెహమాన్ బాణీలు, అరవింద్ స్వామి – మధుబాల జోడీ అభినయం… ఆ సినిమాని క్లాసిక్ గా నిలిపాయి. అలాంటి `రోజా` చిత్రంలో జంటగా నటించిన అరవింద్ స్వామి, మధుబాల… చాన్నాళ్ళ తరువాత మరోమారు జట్టుకట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ఆ వివరాల్లోకి వెళితే… ప్రముఖ నటీమణి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` పేరుతో ఓ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా కోసమే అరవింద్, మధుబాల మరోసారి జంటగా నటిస్తున్నారు. ఇందులో యంజీఆర్ గా అరవింద్ నటిస్తుంటే… అతని శ్రీమతి జానకిగా మధు నటిస్తోంది. మరి… `రోజా` తరహాలోనే `తలైవి` కూడా ఈ ఎవర్ గ్రీన్ పెయిర్ కి మెమరబుల్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. కాగా, జూన్ లో `తలైవి` తెరపైకి రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























