# NANI27 టైటిల్ రిలీజ్

#NANI27 Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,#NANI27,#ShyamSinghaRoy,Shyam Singha Roy,Nani 27th Movie Titled As Shyam Singha Roy,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Telugu Movie Latest News,Nani,Rahul Sankrityan,#SSR,Natural Star Nani,Natural Star Nani in And As Shyam Singha Roy,Shyam Singha Roy Release Date,Shyam Singha Roy Movie Release Date,Shyam Singha Roy Telugu Movie Release Date,Nani 27th Movie Release Date

టాలీవుడ్‌ యాక్టర్‌ నాని బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీ బిజీ గా వున్నాడు. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమా ఉగాది పండుగ రోజు అంటే మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాతో పాటు శివనిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్‌ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా.. . థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు నాని. టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి ఓ సినిమాను చేస్తున్నాడు. ఇక ఇవాళ నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =