భాగ్య‌న‌గ‌రంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`

Most Eligible Bachelor Movie Special Shooting Update

అక్కినేని అఖిల్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్`. `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ రూపొందిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సగానికిపైగా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కి సంబంధించి తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఇందులో భాగంగా షాపింగ్ మాల్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా, గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వేస‌వి కానుక‌గా ఏప్రిల్ నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

మ‌రి… తొలి మూడు చిత్రాల‌తో ఆశించిన విజ‌యాలు అందుకోలేక‌పోయిన అక్కినేని బుల్లోడు అఖిల్… నాలుగో చిత్రంతోనైనా భారీ స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.