పునర్జన్మల నేపథ్యంలో నాని ‘శ్యామ్ సింగరాయ్‌’

Nani New Movie Shyam Singha Roy Story Is Based On The Theme Of Rebirths

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ఓ సినిమాను చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అప్పుడే ఈ సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న టాక్ ఏంటంటే… ఈ సినిమాలో రెండు ప్రేమకథలు ఉంటాయని తెలుస్తోంది. ఒక ప్రేమకథ హైదరాబాద్ నేపథ్యంలో .. మరో ప్రేమకథ కలకత్తా నేపథ్యంలో సాగనున్నట్టుగా చెబుతున్నారు. ఈ రెండు ప్రేమకథల మధ్య పునర్జన్మకి సంబంధించిన లింక్ ఉంటుందని అంటున్నారు.అంతేకాదు ఈ సినిమాలో కూడా నానిది మూడు పాత్రలు ఉండవచ్చనిపిస్తోంది. మరి ఈ వార్తలు ఎంత వరకూ నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[custom_ad]

ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా నటించిన ‘వి’ సినిమా ఉగాది పండుగ రోజు మార్చి 25 న రిలీజ్ కానుంది. దీనితో పాటు శివనిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్‌ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా.. . థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.