`నిన్ను కోరి` తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `టక్ జగదీష్`. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం `టక్ జగదీష్`కి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ ని పూర్తిచేసిన యూనిట్.. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మలి దశ చిత్రీకరణని జరుపుతోంది. ఈ షెడ్యూల్ లో ఒక పాట, ఓ పోరాట ఘట్టంతో పాటు పలు కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… ఇందులో నానికి మరదలి పాత్రలో ఐశ్వర్యా రాజేష్ నటించనుండగా.. ప్రియురాలి పాత్రలో రీతూ వర్మ దర్శనమివ్వనుందట. అలాగే `జగదీష్`(నాని)కి అన్న పాత్రలో జగపతిబాబు కనిపిస్తాడట.



కాగా, జూలై నెలలో `టక్ జగదీష్` ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























