వరుణ్ తేజ్ సినిమాలో..!

Kannada Superstar Upendra To Play A Pivotal Role In Varun Tej New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kannada Superstar Upendra,Varun Tej,Varun Tej Latest News,Varun Tej New Movie News,Varun Tej Next Film Updates,Varun Tej Latest Movie Details,#VT10: Kannada Actor Upendra To Play An Important Role In Varun Tej – Starrer?

మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్… ఎఫ్2 సినిమాతో కామెడీ యాంగిల్ ను చూపించాడు.. గద్దల కొండ సినిమాతో తనలోని నెగిటివ్ షేడ్ ను కూడా చూపించాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘బాక్సింగ్’ నేపథ్యంలో వరుణ్ సినిమా చేస్తున్న చేస్తున్నాడు. గత నెల ఫిబ్రవరి 24 న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించగా… ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. సెకండ్ షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో, తెలుగులో పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటించిన ఉపేంద్ర. ఈ సినిమాలో కూడా ఉపేంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు వెంకటేష్ బాబీ ఈ మూవీ తో నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 18 =