ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టని రాజమౌళి మరి కొద్ది రోజులలో ఫస్ట్ లుక్తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం భావిస్తుందట. ఇక హిందీలోను చిత్రం విడుదల కానుండగా, అక్కడ ‘రామ రావణ్ రాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారట. మరి ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అప్పుడు అన్ని భాషల్లో కూడా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా? అసలేం చేస్తారో తెలియాలంటే రాజమౌళికి చెప్పేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.



కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























