మలయాళ, తమిళ, హిందీ, తెలుగు మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరో గా రాణిస్తున్న దుల్కర్ సల్మాన్, టాలీవుడ్, కోలీవుడ్ ల స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న తమిళ మూవీ షూటింగ్ ఈ రోజు చెన్నై లో ప్రారంభం అయ్యింది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1987 సంవత్సరంలో “ఇన్సాఫ్ కి పుకార్ ” హిందీ మూవీ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా బృంద మాస్టర్ సినీ కెరీర్ ను ప్రారంభించారు. 2003సంవత్సరం లో సూర్య హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “కాక్క కాక్క ” తమిళ మూవీ తో కొరియోగ్రాఫర్ గా మారారు. సక్సెస్ ఫుల్ హిందీ, తమిళ, తెలుగు మూవీస్ కు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన బృంద మాస్టర్ ఇప్పుడు దర్శకురాలిగా మారారు. కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు బృంద మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: