విశాల్ ‘డిటెక్టివ్‌ 2’ ఫస్ట్ లుక్ రిలీజ్

Vishal Detective 2 Movie First Look,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Detective 2 Movie First Look,Detective 2 First Look,Detective 2 Movie Latest News,Vishal First Look From Detective 2,Detective 2,Vishal,Vishal New Film Detective 2

విశాల్ హీరోగా మిస్కిన్‌ దర్శకత్వంలో ‘డిటెక్టివ్‌’ సినిమా వచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన ‘తుప్పరివాలన్ ‘తమిళ మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘డిటెక్టివ్’ కూడా మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘డిటెక్టివ్‌’ సినిమా సీక్వెల్‌ చేస్తున్న సంగతి కూడా విదితమే. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్‌ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కించాలని తననే తీసుకున్నారు. అయితే షూటింగ్ మధ్యలోనే డైరెక్టర్ మిస్కిన్ సినిమా నుంచి తప్పుకున్నాడు. కొద్దిరోజులుగా విశాలే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో ప్రసన్న కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆశ్య హీరోయిన్‌గా ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.