ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 162
నటన లో కొంత పరిణితి సాధించా - రష్మిక
ద్వి భాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్
నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి బాబు..!

పవన్ కళ్యాణ్ `తొలిప్రేమ`కి సీక్వెల్ రానుందా?

ఏప్రిల్ 3 నుంచి `వరుణ్ తేజ్ 10`... సెకండ్ షెడ్యూల్

పూణేలో `ఆర్ ఆర్ ఆర్` నెక్స్ట్ షెడ్యూల్

బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన హను రాఘవపూడి..!

అదిరిపోయే రేంజ్ లో 'రెడ్' ప్రీ రిలీజ్ బిజినెస్
విజయశాంతి సినిమాకు అరుదైన గౌరవం

తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటిపై మరోసారి ఐటి రైడ్

"వకీల్ సాబ్" కు జోడీ ఎవరు ?

సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

'పలాస' డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!
అనుష్క పేరు వెనుక కథ
స్టార్ హీరోయిన్ అనుష్క 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో నిన్న ఘనం గా జరిగాయి. టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. "సూపర్ " మూవీ తో అనుష్క ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అనుష్క టాలీవుడ్ ఎంట్రీ, ఆమె పేరు వెనుక కథ ను తెలిపారు.
ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క జన్మ ధన్యం: కె. రాఘవేంద్రరావు
2005 సంవత్సరంలో వచ్చిన 'సూపర్' సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శబ్దం' ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లోఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు దర్శకులు, నిర్మాతలు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.
నటన లో కొంత పరిణితి సాధించా - రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో రూపొందిన "సరిలేరు నీకెవ్వరు", నితిన్ తో రూపొందిన "భీష్మ "మూవీస్ ఘనవిజయం సాధించాయి. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న AA 20 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కార్తీ హీరోగా రూపొందుతున్న "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం కానున్నారు.
ద్వి భాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్
సక్సెస్ ఫుల్ "ఏ మాయ చేసావె " మూవీ తో ప్రేక్షకులను మాయ చేసిన సమంత టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది , మనం, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ "ఓ .. బేబీ " తరువాత సమంత మరే మూవీ ని అంగీకరించలేదు.
నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి బాబు..!
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఢీ' కు సీక్వెల్ రాబోతున్నట్టు గత రెండు రోజుల నుండి వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఢీ2 కి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. సమ్మర్ తర్వాత ఢీ 2 చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుందని వార్తలు జోరుగా వినిపించాయి.

కమల్ హాసన్ అద్వితీయ అభినయానికి దర్పణం `స్వాతిముత్యం`కి 34 ఏళ్ళు
వైవిధ్యభరిత పాత్రలకు పెట్టింది పేరు లోకనాయకుడు కమల్ హాసన్. స్వతహాగా తమిళ కథానాయకుడైనప్పటికీ... దేశవ్యాప్తంగా అశేష అభిమానగణాన్ని పొందారాయన. ఇక తెలుగు పరిశ్రమతోనూ కమల్ కి మంచి అనుబంధమే ఉంది. ఇక్కడ నేరుగా నటించిన పలు చిత్రాలు ఘనవిజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. మరీ ముఖ్యంగా... దర్శకదిగ్గజం కె. విశ్వనాథ్ కాంబినేషన్ లో కమల్ నటించిన చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి. వాటిలో `స్వాతిముత్యం` ఒకటి.

పవన్ కళ్యాణ్ `తొలిప్రేమ`కి సీక్వెల్ రానుందా?
`తొలిప్రేమ`(1998)... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్. ఈ సినిమాతోనే పవన్ కెరీర్ మేలిమలుపు తీసుకుంది. ఎ. కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం... అప్పట్లో భారీ విజయం సాధించింది. ఆ యేటి మేటి చిత్రాల్లో ఒకటిగా నిలచింది. ఇప్పటి తరాన్ని సైతం ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ విశేషంగా అలరిస్తూనే ఉంది. కట్ చేస్తే.. 22 ఏళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది.

బాలకృష్ణ - బోయపాటి చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి
`సింహా`(2010), `లెజెండ్` (2014) వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.

ఏప్రిల్ 3 నుంచి `వరుణ్ తేజ్ 10`... సెకండ్ షెడ్యూల్
`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాల విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వరుణ్... బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా, ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. వైజాగ్ లో 15 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో వరుణ్, కథానాయిక సయీ మంజ్రేకర్, నదియా, నవీన్ చంద్ర తదితరులపై మేజర్ సీక్వెన్స్ షూట్ చేశారు.

పూణేలో `ఆర్ ఆర్ ఆర్` నెక్స్ట్ షెడ్యూల్
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ పూణే పరిసర ప్రాంతాల్లో జరుగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో తారక్, చరణ్.. ఇద్దరూ పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించి అక్కడ అనుమతులు కూడా తీసుకున్నారని వినికిడి.

బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన హను రాఘవపూడి..!
టాలీవుడ్ డైరెక్టర్ లలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ ఆ లక్కీ ఛాన్స్ ను కొట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హను రాఘవపూడి. 'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. కమర్షియల్ గా ఈ సినిమా పోయినా కూడా సినిమాకు మాత్రం మంచి టాక్ వచ్చింది. ఇక నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తో మరో డిజాస్టర్ పొందాడు. ఇక తెలుగులో ఈ డైరెక్టర్ సినిమాలు రావడం కష్టమే అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ లోనే ఛాన్స్…

విజయ్ 'మాస్టర్' తెలుగు ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం విజయ్ ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి 'ఓరు కుట్టి కథ' అనే ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

100% ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా...`. ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
'ఒరేయ్ బుజ్జిగా' - 'ఈ మాయ పేరేమిటో' సాంగ్ రిలీజ్
వరుస ప్లాప్స్ వెంటాడుతున్న హీరోల్లో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకడు. చాలా ఏళ్లుగా రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ అనేదే లేకుండా పోయింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమాతో వస్తున్నాడు. విజయ్‌కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరో గా ఈ సినిమా వస్తుంది. ఉగాదికి రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి పాటలు విడుదల చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు. ' ఈ మాయ…

అదిరిపోయే రేంజ్ లో 'రెడ్' ప్రీ రిలీజ్ బిజినెస్
ఒక హీరో సినిమా ప్లాప్ అయిందంటే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుందో... హిట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియని విషయం కాదు. సినిమా ప్లాప్ అయిందంటే హీరో తో సినిమా చేయడానికి భయపడతారు.. ఇక హిట్ వస్తే ఆ హీరో వెంట పడతారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే...ఇప్పుడు రామ్ పరిస్థితి కూడా అలానే ఉంది. అసలుసంగతేంటంటే...
విజయశాంతి సినిమాకు అరుదైన గౌరవం
ఇప్పుడంటే హీరోయిన్లు కాస్త తెలివితెచ్చుకొని గ్లామర్ పాత్రలకు చెక్ పెట్టి నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేయడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. కానీ దాదాపు 30 దశాబ్దాల క్రితమే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి... స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క సామాజిక దృక్పదం వుండే సినిమాల్లో నటించేవారు. విజయశాంతి నటించిన నేటి భారతం, దేవాల యం, ఆశయం, ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలు పెద్ద సంచలనమే సృష్టించాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటిపై మరోసారి ఐటి రైడ్
కొన్ని రోజుల క్రితం ఐటి శాఖ తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటి మీద, అతనికి సంబంధించిన ఆఫీస్ ల పైనా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటి శాఖ ఈ రోజు మరోసారి విజయ్ ఇంటి పై రైడ్ చేసింది. విజయ్ హీరో గా నటించిన "బిగిల్ " (విజిల్ ) మూవీ నిర్మాత, ఫైనాన్షియర్ ఇళ్ళ పై ఐటి శాఖ దాడులను నిర్వహించింది.

"వకీల్ సాబ్" కు జోడీ ఎవరు ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "వకీల్ సాబ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, "మగువా" సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్, నివేత పేతురాజ్ జంటగా రూపొందనున్న సోషల్ డ్రామా ప్రొడక్షన్ నెం 1 మూవీ ఈ రోజు ప్రారంభం అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత BVSN ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ దేవుడి ఫోటో పై క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

'పలాస' డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!
వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'పలాస 1978' తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కిరణ్ కుమార్. ఈ నెల 6 న విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణ కుమార్. ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను చాలా న్యాచురల్ గా చిత్రీకరించిన విధానానికి చాలా మంది ఫిదా అయ్యారు.