‘లవ్ స్టోరీ’ – ‘ఏ పిల్లా’ ఫుల్ సాంగ్ రిలీజ్

Ay Pilla Lyrical Song From Love Story Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ay Pilla Lyrical Song,Ay Pilla Song,Ay Pilla Full Song From Love Story Movie,Love Story Movie,Love Story Movie Songs,Love Story Telugu Movie Songs

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో ‘ల‌వ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే వాలెంటైన్స్ డే సందర్భంగా “లవ్ స్టోరీ” మూవీ లోని ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియోను రిలీజ్ చేయగా అది ఎంత వైరల్ అయిందో తెలుసు. ముఖ్యంగా లాస్ట్ సీన్ కు అందరూ ఫిదా అయ్యారు. సమంత కూడా ఈ సీన్ కు స్పందించి ట్వీట్ చేసిందంటేనే అర్థంచేసుకోవచ్చు… ఎంత ఇంపాక్ట్ చూపించిందో. ఇప్పుడు తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. అంతేకాదు ఫిదాలో సాయి పల్లవితో మ్యాజిక్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి నాగ చైతన్య-సాయి పల్లవిల ‘ లవ్ స్టోరీ’ ఎలా ఉంటుందో…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =