స్టార్ హీరోయిన్ అనుష్క 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో నిన్న ఘనం గా జరిగాయి. టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. “సూపర్ ” మూవీ తో అనుష్క ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అనుష్క టాలీవుడ్ ఎంట్రీ, ఆమె పేరు వెనుక కథ ను తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




అనుష్క ను ఫస్ట్ టైమ్ ముంబై లో కలిశానని, మంచి హైట్ తో అందంగా ఉన్న అనుష్కను “సూపర్” మూవీ లో ఒక క్యారెక్టర్ కై ఎంపిక చేశానని , యాక్టింగ్, డ్యాన్స్ తెలుసా అని అడిగితే తెలియదు అని చెప్పటంతో టెన్షన్ పడ్డానని, తన పేరు, ఏం చేస్తున్నావని అడిగితే తన పేరు స్వీటీ అని, యోగా టీచర్ అని చెప్పిందని , హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో నాగార్జున స్వీటీ ని చూడగానే ఓకే చేశారని, పేరు మార్చమని నాగార్జున సలహా ఇవ్వడంతో , చాలా పేర్లు అనుకున్నామని, సూపర్ మూవీ లో ఒక సాంగ్ పాడటానికి వచ్చిన సింగర్ పేరు అనుష్క అని, పేరు నచ్చడంతో స్వీటీ కి అనుష్క పేరు ఖాయం చేశామని, రెండు రోజులపాటు అనుష్క, అనుష్క అని స్వీటీ ని పిలవడంతో స్వీటీ అనుష్క గా మారిందని పూరి జగన్నాథ్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























