దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ పూణే పరిసర ప్రాంతాల్లో జరుగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో తారక్, చరణ్.. ఇద్దరూ పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించి అక్కడ అనుమతులు కూడా తీసుకున్నారని వినికిడి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




తారక్ కి జోడీగా ఒలివియా మోరీస్, చరణ్ కి జంటగా అలియా భట్ నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`లో అజయ్ దేవగణ్, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























