టాలీవుడ్ డైరెక్టర్ లలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ ఆ లక్కీ ఛాన్స్ ను కొట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హను రాఘవపూడి. ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. కమర్షియల్ గా ఈ సినిమా పోయినా కూడా సినిమాకు మాత్రం మంచి టాక్ వచ్చింది. ఇక నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తో మరో డిజాస్టర్ పొందాడు. ఇక తెలుగులో ఈ డైరెక్టర్ సినిమాలు రావడం కష్టమే అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ లోనే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనీల్ శర్మ, సన్నిడియోల్ కాంబినేషన్ లో గతంలో గదర్ ఏక్ ప్రేమ కథ చిత్రం వచ్చి సూపర్ హిట్టైంది. 2001లో వచ్చిన ఈ చిత్రం సన్నిడియోల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు వెరితోనే హను రాఘవపూడి సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ కి స్కెచ్ వేశారట. దానికి హను రాఘవూడి దర్శకత్వం వహిస్తున్నారట. వచ్చే నెల నుంచి ఈ సినిమా పట్టాలు ఎక్కబోతునట్టు తెలుస్తుంది. మొత్తానికి హను బంపర్ ఆఫర్ నే కొట్టేసాడు. మరి ఈ సినిమా కనుక హిట్ అయితే వరుస సినిమాలు క్యూ కడతాయనడంలో సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: