“వకీల్ సాబ్” కు జోడీ ఎవరు ?

Which Of These Top Heroines Going To Pair Opposite Pawan Kalyan In Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ హిట్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, “మగువా” సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడీ గా ఎవరు నటించనున్నారో అనే విషయం ఆసక్తికరం గా మారింది. శృతి హాసన్, ఇలియానా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా “గబ్బర్ సింగ్ “, “కాటమరాయుడు” మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా రూపొందిన “జల్సా ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ ఇద్దరి లో ఎవరు పవన్ కళ్యాణ్ కు జోడీ గా నటిస్తారనే విషయం త్వరలోనే వెల్లడి కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =