కొన్ని రోజుల క్రితం ఐటి శాఖ తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటి మీద, అతనికి సంబంధించిన ఆఫీస్ ల పైనా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటి శాఖ ఈ రోజు మరోసారి విజయ్ ఇంటి పై రైడ్ చేసింది. విజయ్ హీరో గా నటించిన “బిగిల్ ” (విజిల్ ) మూవీ నిర్మాత, ఫైనాన్షియర్ ఇళ్ళ పై ఐటి శాఖ దాడులను నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్ ” మూవీ ఏప్రిల్ 9వ తేదీ రిలీజ్ కానుంది. “మాస్టర్ ” మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సందర్భంగా ఆ మూవీ కో ప్రొడ్యూసర్ లలిత్ కుమార్ ఇంటిపై ఐటి శాఖ రైడ్ జరిపిన తరువాత హీరో విజయ్ ఇంటిపై రైడ్ జరిపినట్టు సమాచారం. తాజాగా విజయ్ ఇంటిపై జరిగిన ఐటి రైడ్ వార్త కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. విజయ్ హీరోగా నటించిన “మెర్సల్ “(అదిరింది ) మూవీలో జి ఎస్ టి , నోట్ల రద్దు పై డైలాగ్స్ ఉండటంతో భారతీయ జనతా పార్టీ కావాలనే విజయ్ ను టార్గెట్ చేస్తుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























