‘ఒరేయ్ బుజ్జిగా’ – ‘ఈ మాయ పేరేమిటో’ సాంగ్ రిలీజ్

Ee Maya Peremito Full Song, Ee Maya Peremito Lyrical Song, Ee Maya Peremito Song, Ee Maya Peremito Song From Orey Bujjiga Is Out, Latest Telugu Movies News, Orey Bujjiga, Orey Bujjiga Ee Maya Peremito Song: Sid Sriram Lends His Magical Voice, Orey Bujjiga Movie, Orey Bujjiga Movie Songs, Orey Bujjiga Movie Updates, Orey Bujjiga Songs, Orey Bujjiga Telugu Movie, Orey Bujjiga Telugu Movie Latest News, Orey Bujjiga Telugu Movie Songs, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

వరుస ప్లాప్స్ వెంటాడుతున్న హీరోల్లో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకడు. చాలా ఏళ్లుగా రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ అనేదే లేకుండా పోయింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమాతో వస్తున్నాడు. విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరో గా ఈ సినిమా వస్తుంది. ఉగాదికి రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి పాటలు విడుదల చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు. ‘ ఈ మాయ పేరేమిటో’ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

మరి ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. అదే రోజు నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమా రిలీజవుతోంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. గతంలో దిల్ రాజు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ‘లవర్’, ‘ఇద్దరిలోకం ఒకటే’ వంటి సినిమాలు వచ్చాయి. మరి ఈసారి దిల్ రాజుతో బాక్సాఫీస్ వద్ద పోటీపడి రాజ్ తరుణ్ హిట్ కొడతాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =