వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కిరణ్ కుమార్. ఈ నెల 6 న విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణ కుమార్. ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను చాలా న్యాచురల్ గా చిత్రీకరించిన విధానానికి చాలా మంది ఫిదా అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా విడుదలకు ముందే ప్రివ్యూ చూసిన అల్లు అరవింద్… కరుణ కుమార్ పనితనం బాగా ఆకట్టుకోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కొత్త దర్శకుడికి ఆఫర్ కూడా ఇచ్చారు. తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని.. కరుణ కుమార్ కు అడ్వాన్స్ చెక్ కూడా అందించారు.




ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో అరవింద్ తో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలు చెయ్యగా అవి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. దీనితో మూడోసారి మళ్ళీ విజయ్ దేవరకొండ తోనే ఈ సినిమా తీయాలన్న ఆలోచనతో కరుణ కుమార్ ను విజయ్ దేవరకొండ దగ్గరకు పంపించాడట. ఇక కరుణ కుమార్ చెప్పిన కథకు రౌడీ హీరో కూడా ఇంప్రెస్ అయ్యి కొన్ని మార్పులు కూడా చెప్పాడట. మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే దీనిపై ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























