ద్వి భాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్

Actress Samantha Akkineni,Samantha Gives Green Signal For A Dual Language Movie,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Samantha Akkineni Dual Language Movie,Actress Samantha,Samantha, Samantha New Films 2020,Samantha Latest News 2020

సక్సెస్ ఫుల్ “ఏ మాయ చేసావె ” మూవీ తో ప్రేక్షకులను మాయ చేసిన సమంత టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది , మనం, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ “ఓ .. బేబీ ” తరువాత సమంత మరే మూవీ ని అంగీకరించలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

10 సంవత్సరాలుగా తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న సమంత ఇప్పుడు తమిళ, తెలుగు భాషలలో రూపొందనున్న ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోనీ పిక్చర్స్ బ్యానర్ పై “గేమ్ ఓవర్” మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఒక మూవీ తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కనుంది. ఈ మూవీ లో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. సమంత ప్రస్తుతం “ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2” వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.