ఇప్పుడంటే హీరోయిన్లు కాస్త తెలివితెచ్చుకొని గ్లామర్ పాత్రలకు చెక్ పెట్టి నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేయడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. కానీ దాదాపు 30 దశాబ్దాల క్రితమే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి… స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క సామాజిక దృక్పదం వుండే సినిమాల్లో నటించేవారు. విజయశాంతి నటించిన నేటి భారతం, దేవాల యం, ఆశయం, ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలు పెద్ద సంచలనమే సృష్టించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తాజాగా కర్తవ్యం సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా కర్తవ్యం సినిమా తెలుగు, హిందీ పోస్టర్స్‌ని ఎన్ ఎఫ్ ఎ ఏ (నేషనల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండి యా) పోస్ట్ చేసింది. అంటే… ఇన్నేళ్ళలో.. ఎన్నో భాషల్లో.. ఎన్నో మహిళా ప్రాధాన్యత వున్న సినిమాలు వచ్చినా కూడా మన తెలుగు సినిమాకు ఇలాంటి ఘనత దక్కడం గొప్ప విషయమే.
కాగా ఐపీయస్ అధికారి కిరణ్ బేడీ స్ఫూర్తితో కర్తవ్యం చిత్ర తీశారు. 1990 లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది హిందీలో కూడా రీమేక్ చేయగా అందులో కూ డా విజయశాంతి నటించింది. ఈ చిత్రం ద్వారా నే ఆమె ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: