
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 140

‘ఆచార్య’.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్
మహేష్ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అతనే..?
ఆ లోపు రిటైర్మెంట్ అయిపోతా..!

'పుష్ప' సినిమాలో హైలైట్ గా రష్మిక పాత్ర..!
ఎన్టీఆర్ సినిమాలో పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా ...!
ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ రిలీజ్ డేట్ ?
"హిట్ " మూవీ దర్శకుడితో హీరో నాని మూవీ ?
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ
జీహెచ్ ఎంసీ కార్మికులపై 'దిల్' చూపించిన రాజు..!
విక్రమ్ తో చైతు ఖరారైనట్టే..!

సినిమాకే హైలైట్ గా 'బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్'
రెజీనా మనసులో మాట

యన్టీఆర్ ‘తోడుదొంగలు’కు 66 ఏళ్ళు
‘పుష్ప’ స్టోరీ లైన్ అదేనా?
‘యన్టీఆర్ 30’లో సంజయ్ దత్?
‘పీకే 27’లో రాజకుమారిగా జాక్వలైన్?

"వకీల్ సాబ్" హీరోయిన్ ఇలియానా ?
శ్రీ వెంకటేశ్వర క్రియేహాన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ గా "వకీల్ సాబ్" రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ "వకీల్ సాబ్" లో అంజలి , నివేత థామస్, ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
‘ఆచార్య’.. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. దాదాపు 30 నిమిషాల నిడివి గల ఈ పాత్ర సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని సమాచారం. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ స్టోరీ లైన్‌ను రివీల్ చేశారు చిరు.
మహేష్ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అతనే..?
మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడి పల్లి తోనే ఉంటుంది అన్నారు. ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇప్పుడు పరుశురాం తో చేయనున్నారు. కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆ లోపు రిటైర్మెంట్ అయిపోతా..!
టాలీవుడ్ లో ఉన్న సక్సస్ ఫుల్ అండ్ స్టార్ డైరెక్టర్స్ లో కొరటాల శివ కూడ ఒకరు. రచయితగా సినిమా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాలకి రచనా సహకారం అందించారు. పోసాని మురళీ కృష్ణ దగ్గర పని చేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిపోయారు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

'పుష్ప' సినిమాలో హైలైట్ గా రష్మిక పాత్ర..!
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా పుష్ప నిలిచింది. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ సినిమాలో పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా ...!
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ రిలీజ్ డేట్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
"హిట్ " మూవీ దర్శకుడితో హీరో నాని మూవీ ?
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ హిట్ "అష్టా చెమ్మా " మూవీతో నాని ని హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ , నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన "V" మూవీ లో నెగటివ్ పాత్ర లో పరిచయం చేయడం విశేషం. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి కారణంగా జన జీవనం కష్టాలపాలయింది. ప్రజల ప్రాణ రక్షణ కై తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య బృందాలు, పోలీస్ శాఖ కు కృతజ్ఞతలు తెలపాల్సిందే. పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో హీరో విజయ్ దేవరకొండ కర్తవ్య దీక్షతో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధాన మిచ్చారు.
జీహెచ్ ఎంసీ కార్మికులపై 'దిల్' చూపించిన రాజు..!
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు, రోజువారీ కూలీలకు ఆర్థికంగా.. తినడానికి కూడా ఇబ్బందులు ఎదరువుతున్నాయి. ఇక వారికీ సాయం చేయడానికి పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.
విక్రమ్ తో చైతు ఖరారైనట్టే..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, 'ఏ పిల్లా సాంగ్' పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు
కరోనా నివారణ కై చిరంజీవి ఫ్యామిలీ వినూత్న ప్రచారం
కరోనా మహమ్మారి కారణం గా దేశం లో క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజలు శుభ్రత పాటించడం, సామజిక దూరం, ఇళ్ళకే పరిమితం కావడం వంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోజు రోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతూనే ఉంది. ప్రజలలో కరోనా వ్యాప్తి నివారణ కై అవగాహన కల్పించడానికి మెగా ఫ్యామిలీ వినూత్నంగా ప్రచారం చేశారు.

సినిమాకే హైలైట్ గా 'బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్'
మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్ లాక్ డౌన్ టైం ను కూడా బాగానే ఉపయోగించుకుంటుంది. ఒక పక్క రాజమౌళి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశాడు. ఎడిటర్ తమ్మిరాజు ఇంటిలోనే ఎడిటింగ్ పనులు మొదలు పెట్టేసారు. ఇక ఒకపక్క ఆ పనులు జరుగుతుండగా మరో పక్క ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న కీరవాణి కూడా తన పని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. కీరవాణి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం యొక్క బిజియమ్ ను పూర్తి చేసాడట.. సినిమా మొత్తంలో కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బిజియమ్ సినిమా హైలైట్స్ లోనే ఒకటిగా నిలుస్తుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు కీరవాణి…
రెజీనా మనసులో మాట
'శివ మనసులో శృతి" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తమిళ యాక్ట్రెస్ రెజీనా "పవర్", "పిల్లా నువ్వు లేని జీవితం", "సుబ్రమణ్యం ఫర్ సేల్", " అ !", "7", "ఎవరు " వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తమిళ మూవీస్ లో బిజీగా ఉన్న రెజీనా, తాను నటించాలనుకునే పాత్రల గురించి తన మనసులోని కోరికను వెల్లడించారు.
బాలయ్య హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి..!
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య విలన్ గా నటిస్తున్నాడన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కాస్త నెగెటివ్ షేడ్ ఉంటుందని.. అంతేకాని విలన్ కాదని చెప్పారు. అంతేకాదు ఇప్పటికే భూమిక నెగెటివ్ రోల్ చేస్తుందని…

యన్టీఆర్ ‘తోడుదొంగలు’కు 66 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావుకి అచ్చొచ్చిన దర్శకుల్లో డి.యోగానంద్ ఒకరు. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో 'తోడుదొంగలు' ఒకటి. యన్టీఆర్, హేమలత జంటగా నటించిన ఈ సినిమాలో.. గుమ్మడి, చలం, మద్దాలి కృష్ణమూర్తి, టి.జి.కమల, శివరామకృష్ణయ్య, అట్లూరి పుండరీకాక్షయ్య ముఖ్య భూమికలు పోషించారు. ఈ సినిమాకి సముద్రాల జూనియర్ కథ, సంభాషణలు సమకూర్చారు.
‘పుష్ప’ స్టోరీ లైన్ అదేనా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో కన్నడ కస్తూరి రష్మిక మందన్న నాయికగా నటిస్తోంది. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే మొదటిదశ చిత్రీకరణ పూర్తయింది. లాక్ డౌన్ అనంతరం రెండోదశ చిత్రీకరణని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ స్టోరీ లైన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
‘యన్టీఆర్ 30’లో సంజయ్ దత్?
‘అరవింద సమేత’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

"అల .. వైకుంఠపురములో .. "తమిళ రీమేక్ హీరో శివకార్తికేయన్ ?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ మూవీ "అల .. వైకుంఠపురములో .. " తమిళ భాషలో రీమేక్ కానుంది. హీరో శివకార్తికేయన్ ఈ మూవీ లో కథానాయకుడిగా ఎంపిక అయ్యారని సమాచారం.
‘పీకే 27’లో రాజకుమారిగా జాక్వలైన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ బాట పట్టాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాబిన్ హుడ్ తరహా పాత్రలో సందడి చేయనున్నాడాయన. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో పవన్‌కి జోడిగా ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. అందులో ఒకరిగా శ్రీలంక సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. దాదాపు 40 రోజుల కాల్షీట్స్ ఈ సినిమా కోసం కేటాయించిందట జాక్వలైన్. అంతేకాదు.. ఇందులో ఆమె రాజకుమారి పాత్రలో దర్శనమివ్వనుందని ప్రచారం సాగుతోంది. అలాగే పవన్, జాక్వలైన్ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ కూడా…