‘పీకే 27’లో రాజకుమారిగా జాక్వ‌లైన్‌?

Jacqueline Fernandez Essays The Role Of Princess In PSPK 27

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ బాట పట్టాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాబిన్ హుడ్ తరహా పాత్రలో సందడి చేయనున్నాడాయన. మొఘ‌లాయిల పరిపాలనా కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో పవన్‌కి జోడిగా ఇద్దరు కథానాయికలు నటించనున్నారని సమాచారం. అందులో ఒకరిగా శ్రీలంక సుందరి జాక్వ‌లైన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. దాదాపు 40 రోజుల కాల్షీట్స్ ఈ సినిమా కోసం కేటాయించిందట జాక్వ‌లైన్‌. అంతేకాదు.. ఇందులో ఆమె రాజకుమారి పాత్రలో దర్శనమివ్వనుందని ప్రచారం సాగుతోంది. అలాగే పవన్, జాక్వ‌లైన్‌ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేసిందట యూనిట్. ఇందుకోసం ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దిందని, ఈ గీతం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాలీవుడ్ టాక్. కాగా, లాక్ డౌన్ అనంతరం చిత్రీకరణని పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. 2021 ప్రథమార్థంలో ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం దొంగతనం నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ‘పీకే 27’.. మెగాభిమానులను ఏ మేరకు మురిపిస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.