య‌న్టీఆర్ ‘తోడుదొంగ‌లు’కు 66 ఏళ్ళు

NTR's Blockbuster Hit Movie Thodu Dongalu Completes 66 Years

మ‌హాన‌టుడు య‌న్.టి.రామారావుకి అచ్చొచ్చిన దర్శకుల్లో డి.యోగానంద్‌ ఒకరు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన ప‌లు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వాటిలో ‘తోడుదొంగ‌లు’ ఒక‌టి. య‌న్టీఆర్, హేమ‌ల‌త జంట‌గా న‌టించిన ఈ సినిమాలో.. గుమ్మ‌డి, చ‌లం, మ‌ద్దాలి కృష్ణ‌మూర్తి, టి.జి.క‌మ‌ల‌, శివ‌రామ‌కృష్ణ‌య్య‌, అట్లూరి పుండ‌రీకాక్ష‌య్య‌ ముఖ్య భూమిక‌లు పోషించారు. ఈ సినిమాకి స‌ముద్రాల జూనియ‌ర్ క‌థ‌, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స‌ముద్రాల జూనియ‌ర్ గీత ర‌చ‌న‌ చేయ‌గా.. య‌న్టీఆర్ ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు టి.వి.రాజు స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. వాటిలో “ఉన్న‌తీరు నీవున్న‌ది ఉంది” అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. నేష‌న‌ల్ ఆర్ట్ థియేట‌ర్స్ ప‌తాకంపై య‌న్.త్రివిక్ర‌మ‌రావు నిర్మించిన ఈ సినిమా.. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పుర‌స్కారాన్ని కైవ‌సం చేసుకుంది. 1954 ఏప్రిల్ 15న విడుద‌లైన ‘తోడుదొంగ‌లు’.. నేటితో 66 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =