సినిమాకే హైలైట్ గా ‘బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్’

SS Rajamouli Magnum Opus RRR Background Score Going To Be The Biggest Highlight For The Movie
SS Rajamouli Magnum Opus RRR Background Score Going To Be The Biggest Highlight For The Movie

మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీమ్ లాక్ డౌన్ టైం ను కూడా బాగానే ఉపయోగించుకుంటుంది. ఒక పక్క రాజమౌళి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశాడు. ఎడిటర్ తమ్మిరాజు ఇంటిలోనే ఎడిటింగ్ పనులు మొదలు పెట్టేసారు. ఇక ఒకపక్క ఆ పనులు జరుగుతుండగా మరో పక్క ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న కీరవాణి కూడా తన పని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. కీరవాణి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై వర్క్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం యొక్క బిజియమ్ ను పూర్తి చేసాడట.. సినిమా మొత్తంలో కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బిజియమ్ సినిమా హైలైట్స్ లోనే ఒకటిగా నిలుస్తుందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు కీరవాణి కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ గా నిలుస్తోందట.మరి రాజమౌళి సినిమాలన్నిటికీ కీరవాణి నే సంగీతం అందించాడు. అన్నీ సినిమాల ఆడియో సూపర్ హిట్టే. ఇక ఈ సినిమాకు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదే రేంజ్ లో ఇచ్చేవుంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.