ఆ లోపు రిటైర్మెంట్ అయిపోతా..!

Director Koratala Siva talks about his retirement
Director Koratala Siva talks about his retirement

టాలీవుడ్ లో ఉన్న సక్సస్ ఫుల్ అండ్ స్టార్ డైరెక్టర్స్ లో కొరటాల శివ కూడ ఒకరు. రచయితగా సినిమా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాలకి రచనా సహకారం అందించారు. పోసాని మురళీ కృష్ణ దగ్గర పని చేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిపోయారు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి అంత సక్సెస్ ఫుల్ ట్రాక్ లో ఉన్న శివ తన రిటైర్మెంట్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన
ప్రస్తుతం తన దగ్గర ఉన్న స్క్రిప్టులతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నానని, అవి పూర్తయిన తరవాత తాను దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పాడు. వీటిని పూర్తిచేయడానికి ఐదేళ్లు పట్టొచ్చని.. ఆ తరవాత తాను రిటైర్ అవుతానని వెల్లడించారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. మరి గతంలోనే శివ తన దగ్గర ఓ పది కథలు ఉన్నాయని అవి తీసేసి ఆపేస్తానని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి ఆ కథలు అయిపోతే డైరెక్షన్ ఆపేస్తాడేమో..

కాగా ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.