బాలయ్య హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి..!

Director Boyapati Srinu To Introduce a New Heroine In His Third Movie Venture With Nandamuri Balakrishna

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య విలన్ గా నటిస్తున్నాడన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కాస్త నెగెటివ్ షేడ్ ఉంటుందని.. అంతేకాని విలన్ కాదని చెప్పారు. అంతేకాదు ఇప్పటికే భూమిక నెగెటివ్ రోల్ చేస్తుందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పేరు వినిపిస్తుంది. హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చాడు బోయపాటి.ముందుగా నయనతారను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టుగా వార్తలు వినిపించినా.. తరువాత కాదని తేలిపోయింది. అయితే ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి తెలిపారు. అలాగే అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామని కూడా బోయపాటి క్లారిటీ ఇచ్చారు. మరి ఆ కొత్త హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + three =