మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడి పల్లి తోనే ఉంటుంది అన్నారు. ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇప్పుడు పరుశురాం తో చేయనున్నారు. కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట్ ను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అది ఎవరో కాదు గోపి సుందర్. పరుశురాం గీత గోవిందం సినిమాకు గోపి సుందరే మ్యూజిక్ అందించాడు. మరి ఆ సినిమా ఆడియో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే మహేష్ సినిమాకు కూడా పరుశురాం గోపి నే తీసుకున్నాడట. మరి ఈ వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజం ఎంతో తెలియాలంటే అనౌన్స్మెంట్ వరకూ ఆగాల్సిందే.
ఇక ఇదిలా ఉండగా సందీప్ వంగా తో కూడా మహేష్ సినిమా చేయడానికి రెడీ అయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పరుశురాం తో సినిమా అయిపోయిన వెంటనే మహేష్, సందీప్ వంగా సినిమా పట్టాలెక్కుతుందేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























