ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 125
2022 వేసవిలో ‘ప్రభాస్ 21’
మాతృ భాష పై పట్టు

"హ్యాపీ బర్త్ డే "
మరో వివాదంలో కమల్..!
ముగ్గురు నాయికలతో శర్వానంద్

వెంకటేష్ ‘ప్రేమించుకుందాం... రా!’కు 23 ఏళ్ళు

నాగార్జున ‘సంతోషం’కు 18 ఏళ్ళు
'ప్రభాస్ 21' కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..!

మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్ముతారా...!
"పుష్ప " మూవీ లో రష్మిక స్పెషల్ లుక్
మాళవిక మోహనన్ కిల్లింగ్ లుక్

'ప్రభాస్ 20' సినిమా ప్రారంభం గ్లిoప్స్ మీకోసం..!
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో ?
తన స్టాఫ్ కు అండగా నిలిచిన ఎన్టీఆర్..!
కృతి కర్బంద పోల్ డ్యాన్స్
'విరాట పర్వం' నుండి సాయి పల్లవి లుక్ రిలీజ్
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా వచ్చిన మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
2022 వేసవిలో ‘ప్రభాస్ 21’
‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడీ 'డార్లింగ్' స్టార్. ప్రస్తుతం ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్న ప్రభాస్.. అనంతరం ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు.
‘ఆకాశవాణి’ నుండి తప్పుకున్న రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ..!
రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఆకాశవాణి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన స్టోరీ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా మాత్రం ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఇక గత రెండు రోజులుగా ఈ సినిమానుండి కార్తికేయ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. ఐతే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎస్ ఎస్ కార్తికేయ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆకాశవాణి మూవీ టీమ్ తో పనిచేయం గొప్ప అనుభూతి అని తెలిపారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాను అని చెప్పారు. అందుకు కారణంగా ఆయన ఆకాశవాణి సినిమా దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పారు. దానితో పాటు మిగతా…
మాతృ భాష పై పట్టు
2005 సంవత్సరం సక్సెస్ ఫుల్ "శ్రీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూత లూగించారు. స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్" మూవీ లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో తమన్నా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.

"హ్యాపీ బర్త్ డే "
"నువ్విలా ", లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ " వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ "ఎవడే సుబ్రమణ్యం " మూవీ తో గుర్తింపుపొందారు. సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీతో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి "మూవీ తో ప్రేక్షక, అభిమానులలో సెన్సేషనల్ హీరోగా విజయ్ క్రేజ్ పెంపొందించుకున్నారు. ఆ మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. విజయ్ హీరోగా నటించిన "గీత గోవిందం "మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది.
మరో వివాదంలో కమల్..!
విలక్షణ నటుడు కమల్ హాసన్ కాస్త బోళా మనిషి అని తెలుసు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే మనిషి. అయితే అది ఒక్కోసారి వర్క్ అవుట్ అయినా ఒక్కోసారి మాత్రం పలు వివాదాలకు దారితీస్తుంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న కమల్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల లైవ్ ప్రోగ్రామ్ లో కమల్ ముచ్చటించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అంటే ఛారిటీ కాదని... టికెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారమని చెప్పారు. త్యాగరాజ స్వామిలా రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కమల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది…
చిరంజీవి, శ్రీదేవి సెన్సేషనల్ సోషియో ఫాంటసీ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి 30 ఏళ్ళు
కొన్ని సినిమాలు వెండితెరపై భలేగా మ్యాజిక్ చేస్తాయి. తరాలు మారినా తరగని ఆదరణతో క్లాసిక్స్‌గా గుర్తుండిపోతాయి. అలా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఒకటి. సెల్యులాయిడ్ వండర్‌గా జనాల నీరాజనాలు అందుకున్న ఈ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా, ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ‘జగదేకవీరుడు’ రాజుగా మెగాస్టార్ చిరంజీవి నటన, నర్తన విన్యాసాలు.. ‘అతిలోకసుందరి’ ఇంద్రజగా శ్రీదేవి అందాల అభినయం.. ఈ సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్ళాయి. మహాధ్రష్టగా అమ్రిష్ పురి విలనిజం సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, తనికెళ్ళ…
ముగ్గురు నాయికలతో శర్వానంద్
యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో ఓ పిరియాడిక్ రొమాంటిక్ సాగా రాబోతున్న సంగతి తెలిసిందే. 1910 నుంచి 2021 వరకు సాగే ప్రేమకథా చిత్రమిది. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో శర్వానంద్ సరసన ముగ్గురు నాయికలు సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చందు మొండేటి స్వయంగా వెల్లడించాడు.

వెంకటేష్ ‘ప్రేమించుకుందాం... రా!’కు 23 ఏళ్ళు
తెలుగునాట అగ్రకథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఆ చిత్రాలే ‘ప్రేమించుకుందాం... రా!’, ‘ప్రేమంటే ఇదేరా’.

నాగార్జున ‘సంతోషం’కు 18 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జున కెరీర్లో పలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. వాటిలో ‘సంతోషం’ ఒకటి. ఫ్యామిలీ మూవీస్ స్పెషలిస్ట్ దశరథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియ నాయకానాయికలుగా నటించారు. “కళాతపస్వి” కె.విశ్వనాథ్, ప్రభుదేవా, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, సునీల్, పృథ్వీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, ‘ఆహుతి’ ప్రసాద్, సుమిత్ర, సుధ ముఖ్య పాత్రలు పోషించారు.
'ప్రభాస్ 21' కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..!
ప్రభాస్ 20 సినిమానే ఇంకా పూర్తికాలేదు కానీ ప్రభాస్ 21 సినిమాపై మాత్రం రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వస్తూనే ఉంది. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. పాన్ వరల్డ్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో.. ఈ సినిమాకు స్టార్ క్యాస్ట్ సైతం భారీగా ఉండనుందట. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ…

మెడికల్ షాపుల్లో కూడా మద్యం అమ్ముతారా...!
సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై అప్పుడప్పుడు కామెంట్లు రావడం చూస్తూనే ఉంటాం. వాటికి వాళ్ళు కూడా అప్పుడప్పుడు రివర్స్ కౌంటర్ లు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై వచ్చిన కామెంట్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ దుకాణం నుంచి చేతిలో కొన్ని సీసాలు, కొన్ని ప్యాకెట్లతో వస్తూ అందులో ఆమె కనిపిస్తుంది. ఇక దీనిపై కమాల్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ, లాక్ డౌన్ సందర్భంగా రకుల్ ప్రీత్ ఏం కొనుగోలు చేసింది? మద్యం ఏమైనా కొనుగోలు చేసిందా? అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనికి రకుల్ ప్రీత్ ఆసక్తికరంగా స్పందించింది. 'అయ్యో…

భారీ రేటుకు 'కె.జి.ఎఫ్2' డిజిటల్ రైట్స్
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.
"పుష్ప " మూవీ లో రష్మిక స్పెషల్ లుక్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో "పుష్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో "పుష్ప"హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది.
మాళవిక మోహనన్ కిల్లింగ్ లుక్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ "డాన్ ", "అంధా ధున్", టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "మహర్షి ", పలు మలయాళ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కె యు మోహనన్ తనయ మాళవిక "పట్టం పోలె "మలయాళ మూవీ తో సినీకెరీర్ ప్రారంభించారు. కన్నడ, తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన "మాస్టర్ " తమిళ మూవీ లో మాళవిక హీరోయిన్ గా నటించారు.

'ప్రభాస్ 20' సినిమా ప్రారంభం గ్లిoప్స్ మీకోసం..!
ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో ?
"కిక్ ", "ఎవడు ", రేసు గుర్రం ", "టెంపర్ "వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ "నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా " మూవీ తో దర్శకుడిగా మారారు. ఆ మూవీ పరాజయం పొందడంతో దర్శకుడిగా వంశీ కి అవకాశాలు రాలేదు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కై ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను వంశీ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
తన స్టాఫ్ కు అండగా నిలిచిన ఎన్టీఆర్..!
కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు...రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. వాటితో పాటు పేదలకు అండగా నిలుస్తూ ఉదారత చాటుకుంటున్నారు చాలా మంది ప్రముఖులు. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు.. సామాన్య ప్రజలు కూడా తమ స్థోమతకు తగిన విధంగా సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సినీ కార్మికుల కోసం చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సాయం అందిస్తున్నారు.
సీనియర్ డైరెక్టర్ వంశీ కూడా వెబ్ సిరీస్ వైపు..!
ఒకప్పుడు సినిమా చూడాలంటే చాలాకష్టమయ్యేది. కానీ రాను రాను టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అన్నీ ఈజీ అయిపోయాయి. ఇక ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసే పని కూడా లేకుండా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వల్ల ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ హవా నడుస్తోందని చెప్పవచ్చు. అందుకే సెలెబ్రిటీస్ సైతం డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోలు హీరోయిన్లను సైతం ను వెబ్ సిరీస్ లలో నటింపచేసి వాటికి మరింత క్రేజ్ తేవాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయి.
కృతి కర్బంద పోల్ డ్యాన్స్
"బోణి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి కర్బంద "తీన్ మార్ ", "ఒంగోలు గిత్త ", "బ్రూస్ లీ " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు తోపాటు కృతి కన్నడ, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కృతి కర్బంద నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4"ఘనవిజయం సాధించింది. కృతి ప్రస్తుతం పులకిత్ సామ్రాట్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ "తైష్ "లో నటిస్తున్నారు.