మరో వివాదంలో కమల్..!

విలక్షణ నటుడు కమల్ హాసన్ కాస్త బోళా మనిషి అని తెలుసు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే మనిషి. అయితే అది ఒక్కోసారి వర్క్ అవుట్ అయినా ఒక్కోసారి మాత్రం పలు వివాదాలకు దారితీస్తుంది. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న కమల్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల లైవ్ ప్రోగ్రామ్ లో కమల్ ముచ్చటించిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అంటే ఛారిటీ కాదని… టికెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారమని చెప్పారు. త్యాగరాజ స్వామిలా రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కమల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. త్యాగరాజ స్వామిని దేవుడిలా కొలిచే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సంగీతకారులు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సంగీతకారుడు పాల్ ఘాట్ రామ్ ప్రసాద్ ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశాడట. మరి ఈ వ్యవహారం ఎక్కడివరకు పోతుందో..?దీనిపై కమల్ ఎలా స్పందిస్తాడో..? చూడాలి. మరోపక్క విజయ్ సేతుపతి కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని అఖిలభారత హిందూ మహాసభ చెన్నై పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం కమల్ శంకర్ దర్శకత్వంలో ‘ భారతీయుడు2’ సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్‌, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల బ్రేక్ తీసుకుంది. ఇక ఈ సినిమాపై కూడా పలు రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా ఆగిపోయిందంటూ పలు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇటీవలే క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =