చిరంజీవి, శ్రీ‌దేవి సెన్సేష‌న‌ల్ సోషియో ఫాంటసీ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి 30 ఏళ్ళు

Mega Star Chiranjeevi and Sridevi Timeless Classic Jagadeka Veerudu Athiloka Sundari Turns 30

కొన్ని సినిమాలు వెండితెరపై భలేగా మ్యాజిక్ చేస్తాయి. తరాలు మారినా తరగని ఆదరణతో క్లాసిక్స్‌గా గుర్తుండిపోతాయి. అలా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఒకటి. సెల్యులాయిడ్ వండర్‌గా జనాల నీరాజనాలు అందుకున్న ఈ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా, ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ‘జగదేకవీరుడు’ రాజుగా మెగాస్టార్ చిరంజీవి నటన, నర్తన విన్యాసాలు.. ‘అతిలోకసుందరి’ ఇంద్రజగా శ్రీదేవి అందాల అభినయం.. ఈ సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్ళాయి. మహాధ్రష్టగా అమ్రిష్‌ పురి విలనిజం సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, తనికెళ్ళ భరణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, బేబీ షాలిని, బేబీ షామిలి, మాస్టర్ రిచర్డ్స్, మాస్టర్ అమిత్, జనకరాజ్, ఆర్.ఎస్.శివాజీ, క్రేజీ మోహన్ ముఖ్య భూమికలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లయరాజా” ఇళయరాజా వీనుల విందైన బాణీలు అందించగా వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం సమకూర్చారు. “అబ్బ నీ తియ్య‌ని”, “ప్రియతమా”, “యమహో”, “అందాలలో”, “మన భారతంలో”, “దినక్కుత్తా”, “జై చిరంజీవా”.. ఇలా ఇందులోని ప్రతీ పాట నిత్యనూతనమే. ఉత్తమ సంగీత దర్శకుడి విభాగంలో ఇళయరాజా ‘నంది’ పురస్కారాన్ని కైవసం చేసుకోగా.. బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ‘ఫిల్మ్ ఫేర్‌’ను సొంతం చేసుకున్నారు దర్శకేంద్రుడు. 1990 మే 9న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fifteen =