ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా వచ్చిన మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘విరాటపర్వం’ యూనిట్ సభ్యులు శుభాకాంక్షలు అందజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఒక బ్యాగ్ తో అమరవీరుల స్థూపం దగ్గర సాయిపల్లవి ఎదురు చూస్తూ కూర్చుంది. ఈ పోస్టర్ తోనే సాయిపల్లవి పాత్ర ఎలా వుండనుందో అని ఒక హింట్ ఇచ్చారు చిత్ర యూనిట్. మరి సాయి పల్లవి నటన గురించి మనకు తెలుసు. ఇక ఈ సినిమాలో కూడా తన నటనతో మంచి మార్కులే కొట్టేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Revolution is an Act of Love!!
Team #ViraataParvam Wishes @Sai_Pallavi92 a very Happy Birthday!!@RanaDaggubati @nanditadas @venuudugulafilm @SLVCinemasoffl @SureshProdns #HappyBirthdaySaiPallavi pic.twitter.com/HfvbWyz6Es— Telugu FilmNagar (@telugufilmnagar) May 9, 2020




కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























